Thursday, February 17, 2011

గగనం

ఉగ్రరూపమై  ఉరిమెను  గగనం
మేఘరుధిరమై వెలిసెను గగనం 
మృత్యుశిఖరమై నిలిచెను గగనం 
రగిలే  గగనం 
గుండె  పిడికిలై బిగిసిన తరుణం 
కంటి  రెప్పలో కదిలెను కథనం 
మసిలి  కుతకుత ఉడికెను గగనం
ఎదలో మధనం 


రాక్షసోన్మాది వేసిన పథకం 
సాగనివ్వంది నీలో నైజం 
ఏది ఏమైన దేశం కోసం 
నీవె ఐనావు అగ్ని క్షిపణం


ద్రోహం పామై వస్తే - నలిపే పాదం నీదే 
భయమే శ్వాసై కదిలే  - జనుల ధైర్యం నీవే
త్యాగం జెండా నీదే   ధర్మం చక్రం నీదే 
క్రౌర్యం జరిపే యుద్ధం గెలిచే సైన్యం  నీదే


భరత దేశాన మొలిచిన రక్తం 
త్రుణముగా ఎచ్చి  నిలిచిన ప్రాణం
మరణదిగ్వేది ఎరుగని నీలో 
మొదలైనది జ్వలనం


ఆశుభమే  కాదు గగనం పైన 
విషము రుప్పింది అసురుల సేన
కరుగుతున్న ఘడియలలోన 
భగభగవుల  మరణం
సమాథిలో రక్తగమనమే సైన్యం 
శిలలలో ------------------ శౌర్యం 
జరుగుతున్నా సమరము లోన
అణువణువు ఒక అస్త్రం
కనులలో  దేశ తలపును కాచి
మనుసులో జాతి ప్రతిమను నింపి
కదులుతున్న  తలపును నీలో 
గనగనమున ఒక ఖడ్గం 
గగనం గగనం  
























No comments:

Post a Comment